: రాజశేఖరరెడ్డి ఫొటో విషయంపై కోడెలకు మరో లేఖ రాసిన కేవీపీ


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మరో లేఖ రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2వ తేదీలోగా ఆయన ఫొటోను అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని లేఖలో కేవీపీ కోరారు. కేవీపీ గతంలో రాసిన లేఖ తనకు అందలేదని కోడెల ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కూడా లేఖలో పేర్కొన్న కేవీపీ... ఈ విషయంపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని లేఖలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వైయస్ చిత్ర పటాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News