: భారత్ ను ఊరిస్తున్న విజయం... ఈ సారైనా గెలుపు దక్కేనా?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. రేపు చివరి రోజైన ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. శ్రీలంక గెలవాలంటే మరో 341 పరుగులు చేయాలి. ఈ నేపథ్యంలో, టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 413 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లను కోల్పోయి 72 పరుగులు చేసింది. మ్యాథ్యూస్ 23 పరుగులతో, కరుణరత్నే 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు, సిల్వా (1), సంగక్కర (18) ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు అశ్విన్ ఖాతాలోకే వెళ్లాయి.