: వికలాంగుడిపై చేయి చేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
న్యాయబద్ధమైన తమ హక్కుల కోసం పోరాడుతున్న ఓ వికలాంగుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకంగా చేయి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, తమకు పెన్షన్ రావడం లేదంటూ మహబూబ్ నగర్ జిల్లా వంగూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఏకంగా ఓ వికలాంగుడిపై చేయి చేసుకున్నారు. ఊహించని ఈ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తమ కష్టాలు తీర్చమని అడిగితే, దాడి చేస్తారా? అంటూ వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలరాజు చర్యను తప్పుబడుతూ, తమ నిరసన కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేశారు.