: సంగక్కర ఔట్... భారత్ శిబిరంలో ఉత్సాహం


ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక టాప్ ఆర్డర్ కూలుతోంది. 8.5 ఓవర్లలో కేవలం 33 పరుగులకే లంక జట్టు 2 వికెట్లను కోల్పోయింది. సిల్వ 1 రన్ కు ఔట్ కాగా, లెజెండరీ సంగక్కర 18 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండు వికెట్లనూ అశ్విన్ బలిగొన్నాడు. కరుణరత్నే (9)కి జతగా కెప్టెన్ మ్యాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు. నాలుగో రోజు ఆటలో ఇంకా 17 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News