: సత్తా చాటిన రహానే... నాలుగవ సెంచరీ నమోదు


కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ రహానే సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం నాలుగు పరుగులకే ఔటైన రహానే... రెండో ఇన్నింగ్స్ లో సమయస్ఫూర్తితో ఆడాడు. మొత్తం 212 బంతులను ఎదుర్కొన్న రహానే 7 ఫోర్ల సహాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నారు. 17వ టెస్టు ఆడుతున్న రహానే తన కెరీర్ లో నాలుగవ సెంచరీ సాధించాడు. మరోవైపు, టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 213 పరుగులకు చేరింది. దీంతో, మొత్తం ఆధిక్యత 306కు చేరుకుంది. మరోవైపు, రోహిత్ శర్మ 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News