: మీరు చెబితే పొలాలిచ్చేస్తాం... పవన్ తో నవ్యాంధ్ర రాజధాని రైతులు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద భూములను ప్రభుత్వానికి ఇవ్వకపోవడానికి గల కారణాలను అక్కడి రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు ఏకరువు పెట్టారు. భూములిచ్చేందుకు సమ్మతించని రైతులతో మాట్లాడేందుకు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం పెనుమాక వచ్చారు. ఈ సందర్భంగా బేతపూడికి చెందిన ఓ రైతు పవన్ కల్యాణ్ తో మాట్లాడుతూ, భూ సమీకరణలో ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల్లో ఒక్కటి కూడా తమకు అనుకూలంగా లేదని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలను చదివి ప్రభుత్వానికి భూములివ్వవచ్చని మీరు చెబితే సంతోషంగా ఇచ్చేస్తామని పవన్ తో అన్నారు.