: పవన్ కల్యాణ్ వేదికపైకి రాయి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి
రాజధాని ప్రాంత రైతుల గోడు వినేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన పర్యటనకు భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో రైతులతో భేటీ అయ్యారు. పలువురు రైతులు తమ భూముల గురించి, తాము పండించే పంటల గురించి, భూసేకరణ వల్ల తమకు కలిగే నష్టం గురించి చెబుతున్నారు. ఈ క్రమంలో, ఒక గుర్తు తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్ ఉన్న వేదిక పైకి రాయి విసిరాడు. అయితే, అది నేరుగా పవన్ ను తాకకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ రాయిని వేదికపై ఉన్న వారు పవన్ కు ఇచ్చారు. కాసేపు, ఆ రాయిని తదేకంగా చూసిన పవన్... దాన్ని చేతిలోనే ఉంచుకున్నారు. ఈ ఘటనతో, కాసేపు అక్కడ అలజడి రేగింది.