: భూ సమీకరణకు చట్టబద్ధత ఏదీ?.. పవన్ కు గోడు వెళ్లబోసుకున్న పెనుమాక రైతులు


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద ప్రభుత్వానికి భూములిచ్చేందుకు వచ్చిన ఇబ్బందేమిటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతులను ప్రశ్నించారు. భూసేకరణ చట్టం కింద ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తున్న కొంతమంది రైతులకు బాసటగా నిలిచేందుకు కొద్దిసేపటి క్రితం పనవ్ కల్యాణ్ పెనుమాక చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సంధించిన ప్రశ్నలకు వేగంగా స్పందించిన రైతులు, అసలు భూ సమీకరణకు చట్టబద్ధతే లేదని తేల్చిచెప్పారు. భూ సమీకరణ కోసం జారీ చేసిన నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం బయటకు చెబుతున్న మాట ఒకటైతే, వాస్తవానికి రహస్యంగా మరికొన్ని కఠిన నిబంధనలున్నాయని తెలిపారు. భూమికి పరిహారంగా ఇచ్చే భూమి సీఆర్డీఏ పరిధిలో ఎక్కడైనా ఇస్తామని ఓ నిబంధన పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాని పక్షంలో వివాదం తలెత్తితే, సీఆర్డీఏ కమిషనర్ నిర్ణయమే ఫైనలన్న ఓ నిబంధన కూడా ఉందని వారు పవన్ కు ఫిర్యాదు చేశారు. రైతులు చెబుతున్న విషయాలను పవన్ కల్యాణ్ ఓపిగ్గా వింటున్నారు.

  • Loading...

More Telugu News