: పటిష్ట స్థితిలో భారత్... సెంచరీకి చేరువలో రహానే


శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే దిశగా టీమిండియా బ్యాటింగ్ సాగుతోంది. ప్రస్తుతానికి, భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 191 పరుగులు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుంటే ప్రస్తుతానికి భారత్ కు 278 పరుగుల లీడ్ ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (82), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో లోకేష్ రాహుల్ (2), విరాట్ కోహ్లీ (10) పరుగులకు పెవిలియన్ చేరారు. రహానే 91 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ 5 పరుగులతో ఆడుతున్నాడు. శ్రీలంక బౌలర్లలో కౌశాల్ రెండు, ప్రసాద్ ఒక వికెట్ పడగొట్టారు. నాలుగో రోజు ఆటలో ఇంకా 58 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News