: వేర్పాటువాద నేత షాబీర్ షాకు ఈడీ సమన్లు... మనీలాండరింగ్ ఆరోపణలే నేపథ్యం
కాశ్మీర్ వేర్పాటువాద నేత షాబీర్ షాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. వేర్పాటువాద ప్రసంగాలకు సంబంధించి నిన్న దేశ రాజధాని వచ్చిన షాబీర్ షాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షాబీర్ షా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, పక్కా ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో షాబీర్ షాపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసిన ఈడీ అధికారులు షాబీర్ షాకు నోటీసులు జారీ చేసింది. త్వరలో ఆయనను విచారించనున్న ఈడీ అధికారులు మనీలాండరింగ్ కు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.