: చంద్రబాబుతో సుజనా, ఏపీ ముఖ్యుల భేటీ... పవన్ కల్యాణ్ వ్యవహారంపైనే ప్రధాన చర్చ


దాదాపు వారం రోజుల తర్వాత హైదరాబాదు వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఏమాత్రం విశ్రాంతి చిక్కడం లేదు. గతం సోమవారం హైదరాబాదు నుంచి కర్నూలు జిల్లా వెళ్లిన ఆయన అటు నుంచి అటే విజయవాడ చేరుకున్నారు. రాజధాని నిర్మాణం, ఉద్యోగుల తరలింపు, ప్రత్యేక ప్యాకేజీ, ఏపీకి హోదా తదితర అంశాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించిన ఆయన నిన్న రాత్రి హైదరాబాదు చేరుకున్నారు. అయితే ఏపీ రాజధాని రైతుల పక్షాన భూసేకరణకు వ్యతిరేకంగా పోరు సాగించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి ఉదయం నవ్యాంధ్ర రాజధానికి బయలుదేరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీకి చెందిన పలువురు ముఖ్య నేతలను ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ కు భూసేకరణపై అర్థమయ్యేలా చెప్పడం ఎలాగన్న విషయంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీతో జరగనున్న భేటీ, ఆ సమావేశంలో ప్రస్తావించాల్సిన పలు అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News