: భూసేకరణకు నిరసనగా ప్రకాశం బ్యారేజీపై వామపక్షాల ధర్నా... నిలిచిపోయిన ట్రాఫిక్


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్ పై ఆందోళనలు మొదలయ్యాయి. సర్కారు నిర్ణయాన్ని నిరసిస్తూ వామపక్షాలు కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై ధర్నాకు దిగాయి. పెద్ద సంఖ్యలో చేరిన వామపక్షాల కార్యకర్తలు బ్యారేజీని దిగ్బంధించారు. దీంతో బ్యారేజీకి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించాల్సిందేనని ఈ సందర్భంగా వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News