: నవ్యాంధ్రకు బయలుదేరిన పవన్ కల్యాణ్... పెనుమాకలో ఏర్పాట్లు పూర్తి
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి నవ్యాంధ్ర రాజధానికి బయలుదేరారు. హైదరాబాదు నుంచి విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునే పవన్ కల్యాణ్, అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని ఉండవల్లికి నేటి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి పెనుమాక వెళ్లే పవన్, అక్కడి ప్రభుత్వ కళాశాలలో రైతులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు నిన్న రాత్రికే పెనుమాకలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.