: నారా లోకేశ్ కు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వండి...విజయవాడ భేటీలో నేతల ప్రతిపాదన
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు పార్టీలో మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నేతలు గళం విప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించాలని నేతలు ప్రతిపాదించారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి పార్టీ పురోభివృద్ధికి పాటుపడిన తీరును ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. నాటి తరహాలోనే నారా లోకేశ్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ప్రతిపాదించారు. దీనిని మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలపరిచారు. ఈ ప్రతిపాదనపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు తర్వాతి అంశంపై చర్చకు వెళ్లిపోయారు.