: పంచుతూ పోతే... మిగిలేది ‘పంచె’నే!: వెంకయ్యనాయుడు చలోక్తి


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్న చలోక్తులు విసురుతూనే అప్పుల బాటను రాష్ట్రాలు వదలాలని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న హైదరాబాదులోని హెచ్ఐసీసీలో స్మార్ట్ టెక్నాలజీపై ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని నగరాలే కాకుండా ప్రతి గ్రామం కూడా స్మార్ట్ గా మారాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ప్రజలు అలవాటు పడిపోయారని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. సంపదను పెంచుకోకుండా పంచుకుంటూ పోతే చివరకు ‘పంచె’ మాత్రమే మిగులుతుందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలపై అప్పుల భారం పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల్లోనూ రాబడులు పెంచుకోవాల్సిన అవసరం ఉందని, యూజర్ చార్జీలను పెంచే విషయంలో స్థానిక సంస్థలు ధైర్యంగా వ్యవహరించాల్సి ఉందని కూడా వెంకయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News