: ఊరికో బెల్టు షాపు... ఇంటికో తాగుబోతు!: ఇదే కేసీఆర్ బంగారు తెలంగాణ డిజైన్ అంటున్న రేవంత్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న మద్యం పాలసీపై టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఊరికో బెల్టు షాపు... ఇంటికో తాగుబోతు’ లక్ష్యంగా కేసీఆర్ సర్కారు మద్యం పాలసీని రూపొందిస్తోందని ఆయన ఆరోపించారు. నిన్న తన సొంత నియోజకవర్గం కొడంగల్ లోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణను ఈ తరహాలోనే కేసీఆర్ డిజైన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీప్ లిక్కర్ ప్రవేశంతో గీత కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గీత కార్మికులు త్వరగా మేల్కోవాలని పిలుపునిచ్చిన ఆయన, ఉద్యమాల్లో గీత కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.