: దావూద్ ఏమో కరాచీలో ఉంటాడు, మీరేమో క్రికెట్ ఆడదాం రమ్మంటారు!: పాక్ పై బీసీసీఐ మండిపాటు


ముంబయి వరుస పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తున్నట్టు వెల్లడి కావడం పట్ల బీసీసీఐ స్పందించింది. దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం ఇవ్వడం నిలిపివేసే వరకు పాక్ తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ ఉండదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెగేసి చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో వేర్పాటువాదులకు చోటు కల్పించే ప్రయత్నాలు కూడా మానుకోవాలని స్పష్టం చేశారు. అప్పుడే భారత్, పాక్ క్రికెట్ సంబంధాలపై ఆలోచిస్తామని అన్నారు. "దావూద్ ఏమో కరాచీలోనే ఉన్నాడు. ఎన్ఎస్ఏ వేర్పాటువాదులను కలవాలని కోరుకుంటున్నారు. మీరు నిజంగానే శాంతి కోసం పాటుపడుతున్నారా? మీతో క్రికెట్ ఆడతామని ఆశిస్తున్నారా?" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News