: ఈ ధర్నాకు ఎన్నేళ్లో తెలుసా?


మనకు తెలిసి ధర్నా అంటే స్వల్ప కాలికమే! కానీ, ఈ ధర్నా ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో తెలుసా? 2001 అక్టోబరు 8న శాంతియుత పంథాలో ఆరంభమై నేటికీ కొనసాగుతోంది. దశాబ్దకాలానికి పైగా కొనసాగుతున్న ఈ శాంతియుత ధర్నా వివరాల్లోకెళితే... రాజస్థాన్ లోని కోటా ఇన్ స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ (ఐఎల్) సంస్థలోని కార్మికులకు పే రివిజన్ సిఫారసుల ప్రకారం 1992 నుంచి 1997 వరకు అరియర్స్ చెల్లించాల్సి ఉంది. అయితే, సంస్థ యాజమాన్యం ఆ చెల్లింపులకు మొగ్గు చూపకపోవడం కార్మికులను ధర్నా బాటపట్టించింది. అప్పటి నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేయడం వారికి దినచర్యలా మారింది. ధర్నా మొదలుపెట్టిన వ్యక్తుల్లో కొందరు చనిపోగా, మరికొందరు నగరం వీడివెళ్లిపోయారు. అయినా, కార్మికులు తమ ధర్నాను కొనసాగిస్తూనే ఉన్నారు. వర్షం వచ్చినా, ఎండ మండుతున్నా ధర్నా మాత్రం ఆగదు. అందుకో రిజిస్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు కార్మికులు. ధర్నాలో పాల్గొంటున్న వారి పేర్లు అందులో నమోదు చేసుకుంటారు. తమ బకాయిలు చెల్లిస్తేనే ధర్నా ఆగుతుందని సీఎల్ నామా అనే రిటైర్ట్ ఉద్యోగి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News