: సుబ్బారావు ఆత్మహత్యాయత్నం చాలా బాధాకరం: చంద్రబాబు
కృష్ణా జిల్లా గుడివాడ మండలం పామర్రులో సుబ్బారావు అనే సామాజిక కార్యకర్త ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రజలు అధైర్య పడవద్దని, ప్రత్యేక హోదా సాధించేవరకు ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోరాదని ఉద్బోధించారు. రాష్ట్ర పరిస్థితులన్నీ ప్రధాని మోదీకి వివరిస్తానని, కేంద్రం మనకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.