: ఎవరు చేస్తారండీ ఇలా?... అది చిరంజీవి గారికే దక్కింది: అల్లు అర్జున్
శుక్రవారం రాత్రి జరిగిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలో నటుడు అల్లు అర్జున్ మాట్లాడారు. చాలా మంది హీరోలుంటారని, వారికి బోలెడు మంది ఫ్యాన్సుంటారని, కానీ, అభిమానులు లక్షలు ఖర్చుబెట్టి ఆడియో ఫంక్షన్ లెవల్లో ఓ హీరో బర్త్ డే ఫంక్షన్ నిర్వహించడం మామూలు విషయం కాదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ అదృష్టం చిరంజీవి గారికే దక్కిందని పేర్కొన్నారు. నిజంగా మెగా ఫ్యాన్స్ చాలా గ్రేట్ అని కొనియాడారు. అంతకుముందు, డ్యాన్స్ చేయాలని యాంకర్ సుమ కోరగా, ఎదురుగా చిరంజీవి గారిని పెట్టుకుని డ్యాన్స్ చేయడమంటే నటరాజు ముందు కోతి కుప్పిగంతులు వేసినట్టుంటుందని అన్నారు. చివరికి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని పాటకు సింపుల్ స్టెప్ తో మెగా ఫ్యాన్స్ ను అలరించారు.