: పవన్ కు సోమిరెడ్డి సూచన
రాజధానికి భూములు ఇవ్వని రైతులకు మద్దతుగా నిలుస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భూములు ఇవ్వని రైతులతో మాట్లాడతానంటున్న పవన్, భూములిచ్చిన రైతులతోనూ మాట్లాడాలని సోమిరెడ్డి సూచించారు. నవ్యాంధ్ర రాజధాని కోసం 96 శాతం మంది రైతులు భూములిచ్చారని, అలాంటప్పుడు కేవలం 4 శాతం మంది రైతుల కోసం రాజధాని నిర్మాణం ఆపేస్తామా? అని ప్రశ్నించారు. పలు ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిగిన విషయాన్ని ఆయన పవన్ కు గుర్తు చేశారు.