: పాకిస్తాన్ తీరు వల్లే చర్చల్లో ప్రతిష్టంభన!: సుష్మా స్వరాజ్


పాకిస్తాన్ తలపెట్టిన జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. పూర్తి స్థాయి చర్చలకు పాక్ సిద్ధంగా లేదని, కేవలం కశ్మీర్ అంశంపైనే పట్టుబడుతోందని అన్నారు. ఈ విషయంలో పాక్ వైఖరి వల్లే ప్రతిష్టంభన నెలకొందని ఢిల్లీలో మీడియా సమావేశంలో సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉఫాలో భారత్-పాక్ దేశాల ప్రధానమంత్రుల మధ్య చర్చలపై ఒప్పందం జరిగిందని, ఇప్పుడు పాక్ అనవసర రాద్ధాంతం చేస్తోందని తెలిపారు. అంతేగాక పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉందన్నారు. ఇటీవల 91 సార్లు కాల్పులకు పాల్పడిందని వివరించారు. ఉఫా సమావేశంలో కాల్పుల ఉల్లంఘనపై చర్చించాలని కూడా నిర్ణయించామన్నారు. ఇరు దేశాల డీజీ స్థాయి సైనికాధికారుల సమావేశంలో, ఉగ్రవాదం అంశంపై చర్చించాలని కూడా నిర్ణయం తీసుకున్నామని సుష్మా చెప్పారు.

  • Loading...

More Telugu News