: మీడియాపై మండిపడిన 'వన్' భామ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో 'వన్-నేనొక్కడినే' చిత్రంలో అందాలు ఆరబోసిన కృతి సనన్ మీడియాపై మండిపడింది. సల్మాన్ ఖాన్ తాజా ప్రాజెక్టు 'సుల్తాన్'లో హీరోయిన్ గా కృతి నటిస్తోందని మీడియా విశేషంగా ప్రచారం చేసింది. అలీ అబ్బాస్ జాఫర్ డైరక్షన్ లో సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం 'సుల్తాన్' కోసం కృతి కాల్ షీట్లు ఇచ్చిందని మీడియాలో వచ్చింది. ఈ కథనాలపై 'వన్', 'హీరోపంటీ' చిత్రాల భామ అంతెత్తున ఎగిరిపడింది. నిజమో, కాదో నిర్ధారించుకోకుండా ఎలా రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుల్తాన్ లో హీరోయిన్ గా నటిస్తున్నానంటూ వచ్చిన కథనాలు అవాస్తవమని పేర్కొంది. ఇలాంటివి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో అర్థంకాదని ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా అలాంటి చాన్సే వస్తే తప్పక అంగీకరిస్తానని, కానీ, తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది.