: రాజధాని ప్రాంతంలో ఈ నెల 26న జగన్ ధర్నా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నా చేయబోతున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26న జగన్ ఈ ధర్నా చేయనున్నారు. గతంలో కూడా జగన్ రాజధాని ప్రాంతంలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3వేల పైచిలుకు ఎకరాల కోసం ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూసేకరణ చేస్తోంది.