: రాధే మాపై నటి డాలీ బింద్రా సంచలన ఆరోపణలు
స్వయం ప్రకటిత సాధ్వి రాధే మాపై ముసురుకున్న వివాదాలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. రాధే మా, ఆమె అనుచరుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కొన్ని రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన నటి డాలీ బింద్రా ఈ పర్యాయం తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ కొత్త వ్యక్తితో శృంగారంలో పాల్గొనాలంటూ రాధే మా తనను బలవంతం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ముంబయి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాధే మా సత్సంగ్ ఆశ్రమంలో ఇలాంటి దారుణాలు సర్వసాధారణమని పేర్కొంటూ... "ఓసారి రాధే మా తనయుడు, మరో అనుచరుడు భక్తుల ముందు నన్ను వేధించే యత్నం చేశారు" అని వివరించారు. డాలీ బింద్రా తాజా ఆరోపణలు గనుక నిజమని తేలితే రాధే మాకు తీవ్ర కష్టాలు తప్పవు. ఇప్పటికే ఆమె వరకట్న కేసుతో సతమతమవుతున్నారు.