: వికలాంగులకు బైక్ లు బహూకరించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వికలాంగులకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ఈరోజు ఢిల్లీలో బహూకరించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి మనోధైర్యంతో విజయాలు సాధించిన 100 మంది యువకులను ఇందుకు ఎంపిక చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తండ్రి, మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 71వ జయంతిని (ఈ నెల 20) పురస్కరించుకుని రాహుల్ ఈ బైక్ లను పంపిణీ చేశారు. తను ట్రస్టీగా ఉన్న ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాజీవ్ జయంతికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.