: తాజ్ మహల్ లో అమర్చిన పురాతన షాండ్లియర్ పడిపోయింది


తాజ్ మహల్ లో రాయల్ గేట్ వద్ద అమర్చిన షాండ్లియర్ ఒకటి పడిపోయిందని తెలిసింది. దాని బరువు దాదాపు 60 కిలోలు, ఆరడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ షాండ్లియర్ ను 1905లో లార్డ కర్జన్ బహూకరించారు. నాటి షాండ్లియర్ ఇప్పుడు పడిపోవడంపై ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ భువన్ విక్రమ్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాండ్లియర్ పడిపోయిందన్న విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. బాగా పాతది అవడంవల్లే పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News