: మావోల మెరుపు దాడి... ఓ జవాను మృతి, పలువురికి గాయాలు


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో ఓ జవాను అక్కడికక్కడే నేలవాలగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా దర్బా సమీపంలోని అడవుల్లో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు మూకుమ్మడి దాడి చేశారు. మావోల దాడి నుంచి జవాన్లు తేరుకునేలోగానే నష్టం జరిగిపోయింది. ఓ జవాను నేలకొరిగాడు. మరో ఇద్దరు గాయాలతో కుప్పకూలిపోయారు. ఆ తర్వాత వచ్చిన వేగంతోనే మావోలు మాయమైపోయారు. గాయపడ్డ జవాన్లను సహచరులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News