: అనంతపురం మార్కెట్ లో మరింత పడిపోయిన టమాటా ధర... ఆందోళనలో రైతులు


ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధరలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనంతపురం మార్కెట్ లో ఈరోజు రైతుల నుంచి అత్యంత తక్కువ ధరకు టమాటా కొనుగోలు చేయాలని వ్యాపారులు, దళారులు నిర్ణయించారు. అదీ 16 కిలోల టమాటా బాక్సును రూ.20 కు కొంటామని స్పష్టం చేశారు. అయితే రూ.100 నుంచి రూ.120 పలికే టమాటా బాక్సు ధర పడిపోవడంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు. టమాటా ధరలను ఒక్కసారిగా తగ్గించడంతో ఆందోళన చెందుతున్నారు. తమకు కనీస గిట్టుబాటు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News