: బెంగళూరు నగర పాలక ఎన్నికలు ప్రారంభం...ఓటేసిన వెంకయ్యనాయుడు


చాలా కాలం పాటు వాయిదా పడుతూ వస్తున్న బెంగళూరు మహా నగర పాలక సంస్థ (బీబీఎంసీ) ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 7 గంటల నుంచి బెంగళూరు వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీకి చెందిన వెంకయ్యకు బెంగళూరులో ఓటు హక్కెలా ఉందనేగా మీ అనుమానం? ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వెంకయ్యనాయుడు కర్ణాటక రాష్ట్ర కోటా నుంచే పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు బెంగళూరులో ఓటు హక్కు లభించింది. ఇదిలా ఉంటే, నేడు జరుగుతున్న పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల 25న జరగనుంది.

  • Loading...

More Telugu News