: ఇక ఎయిర్ పోర్టుల్లో రాబర్ట్ వాద్రాకు తనిఖీలు తప్పవు!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడి హోదాలో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దర్జా అంతా ఇంతా కాదు. ఎయిర్ పోర్టుల్లో ఆయనకు అసలు తనిఖీలే ఉండవు. నేరుగా లోపలికి వెళతారు, అదే స్టైల్లో బయటకూ వచ్చేస్తుంటారు. హర్యానాలో వెలుగు చూసిన భూకుంభకోణాల్లో వాద్రా సంస్థలకు పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఇకపై ఆయనకు ఆ హోదా అవసరం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు విమానాశ్రయాల్లో తనిఖీలు లేని ప్రముఖుల జాబితా నుంచి వాద్రా పేరును తొలగించాలని ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ హోం శాఖకు లేఖ రాసింది. చాలా కాలం పాటు పెండింగ్ లో ఉన్న ఈ లేఖకు తాజాగా హోం శాఖ స్పందన తెలిపింది. ఆ జాబితా నుంచి వాద్రా పేరును తొలగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇకపై స్వదేశీ పర్యటనల్లోనే కాక విదేశీ పర్యటనల్లోనూ రాబర్ట్ వాద్రా ఆయా ఎయిర్ పోర్టులో తనిఖీలు చేయించుకోక తప్పదు.