: ప్యాకేజీలో ఏం కావాలి?... ఏపీ రెసిడెంట్ కమిషనర్ కు కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఫోన్!


ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదిక ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుకుంది. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ సందర్భంగా సదరు నివేదికకు అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఆర్థిక ప్యాకేజీ ద్వారా అసలు ఏపీకి ఏం కావాలో చూడండంటూ ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ పికే సిన్హాను ఆదేశించారట. ఈ క్రమంలో సిన్హా నిన్న ఢిల్లీలో ఏపీ రెసిడెంట్ కమిషనర్ అనిల్ సింఘాల్ కు ఫోన్ చేశారు. ప్యాకేజీలో ఏఏ అంశాలుండాలి, అసలు మీకు ఏం కావాలి? అని ఆయన సింఘాల్ ను కోరారు. దీంతో పలు అంశాలపై ఏపీ సర్కారు ఆశిస్తున్న కేంద్ర సహకారానికి సంబంధించిన సమగ్ర నివేదికను సింఘాల్ నేరుగా సిన్హాకు అందజేశారు. ఈ నివేదికను పరిశీలించిన సిన్హా, అందులోని కొన్ని అంశాలను కూడా ప్యాకేజీలో చేర్చే దిశగా యోచిస్తున్నారు.

  • Loading...

More Telugu News