: ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కారుపై జగన్ ధ్వజం
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల కోసం ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. అందుకు ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే పేదల నుంచి బలవంతంగా భూమిని లాగేసుకుంటుండడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు. ఈ దుష్ట సర్కారు నిస్సహాయులైన రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.