: వదిన కరీనా ఇంటికెళ్లిన కత్రినా... ఇదే తొలిసారి!


కరీనా కపూర్, కత్రినా కైఫ్... ఇద్దరూ బాలీవుడ్ లో అగ్రశ్రేణి తారలే. అయితే, ఇద్దరి మధ్యా వ్యక్తిగత సంబంధాలు మాత్రం అంతగా లేవు. అలాగే ఇద్దరూ కలసి ప్రైవేటు పార్టీలలో కూడా అంతగా కనిపించరు. ఇక, కత్రినా ప్రియుడు రణ్ బీర్ కపూర్.... కరీనాకు కజిన్ అన్న సంగతి తెలిసిందే. ఆ విధంగా చూస్తే కత్రినా... కరీనాకు మరదలన్నమాటే కదా! అయితే, ఇన్నాళ్లకు కరీనా ఇంట అడుగుపెట్టింది కత్రినా. ఎలాగంటారా... సైఫ్ అలీ ఖాన్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీకి ప్రముఖులను పిలిచాడు. కత్రినా-రణ్ బీర్ జోడీకి కూడా ఆహ్వానం వెళ్లింది. ఆ పార్టీకి అటెండ్ అవడం ద్వారా కత్రినా తొలిసారి వదిన ఇంట అడుగుపెట్టినట్టయింది.

  • Loading...

More Telugu News