: బూతులు మాట్లాడితే జరిమానా వేయండి: ఎర్రవల్లిలో కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఎర్రవల్లిలో అందరికీ సొంత ఇళ్లు ఉండాలన్నది సర్కారు ఆకాంక్ష అని, డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఇక, శ్రమించే వారి వద్దే ధనలక్ష్మి ఉంటుందని స్పష్టం చేశారు. దారిద్ర్యంపై పోరాటం సాగిద్దామని, ఎందుకు ధనవంతులం కాలేమో చూద్దామని అన్నారు. ప్రజలెవరూ మొరటుగా వ్యవహరించరాదని సూచించారు. ఎవరైనా బూతులు మాట్లాడితే జరిమానా విధించాలని పేర్కొన్నారు. అంతకుముందు, ఆయన గ్రామజ్యోతిలో భాగంగా గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. రోడ్లను ఊడ్చి, వీధులు శుభ్రం చేశారు.

  • Loading...

More Telugu News