: కేసీఆర్ ను కొనియాడిన తనయుడు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన తనయుడు కేటీఆర్ కొనియాడారు. చిత్తశుద్ధి, గొప్ప సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ అని కీర్తించారు. వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోము అని స్పష్టం చేయడం ద్వారా కేసీఆర్ తన దృక్పథాన్ని ఘనంగా చాటారని కితాబిచ్చారు. కోతలు లేని కరెంట్ ఇచ్చి, తద్వారా అసెంబ్లీలో ప్రతిపక్షాలను నోరెత్తకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని ఉద్ఘాటించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మెల్వలపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ పైవిధంగా పేర్కొన్నారు.