: వర్ధమాన గాయని మౌనికపై యాసిడ్ దాడి
వర్ధమాన తెలుగు సినీ గాయని మౌనికపై యాసిడ్ దాడి జరిగింది. రెండు రోజుల కిందట హైమద్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేసాడని తెలిసింది. ప్రేమను నిరాకరించడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తిని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.