: గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం


హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోల్కొండ కోటకు స్విమ్మింగ్ పూల్ రాబోతోంది. కోటలోని షాహతిమ్ చెరువు లేదా కటోరా హౌస్ కుంటలను స్విమ్మింగ్ పూల్స్ గా అభివృద్ధి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ షాహతిమ్, కటోరా హౌస్ చెరువులను పరిశీలించారు. ఈ రెండు చెరువుల్లో ఒకదానిని ఎంపిక చేసుకుని రూ.1.25 కోట్ల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్ ను నిర్మించనున్నట్టు కమిషనర్ సోమేశ్ చెప్పారు. త్వరలోనే దానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు.

  • Loading...

More Telugu News