: 253 పరుగులు వెనుకబడి ఉన్న లంక... మూడో రోజు ఆటపై పెరిగిన ఆసక్తి
కొలంబో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సిల్వా 51, సంగక్కర 32 పరుగులు చేసి అవుటయ్యారు. తిరిమన్నే 28, కెప్టెన్ మాథ్యూస్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు శ్రీలంక ఇంకా 253 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్ లో 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆటకు మూడోరోజున టీమిండియా బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయగలిగితే ఆట ఆసక్తికరంగా మారుతుంది. తద్వారా ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది.