: తిరుపతి పద్మావతి వర్శిటీలో ఇక 'థ్యాంక్యూ' చెబితేనే లోపలికి అనుమతి!


తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ ప్రాంగణంలోకి ఇకపై ఇతరులు కాలుమోపలేరు. యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యల్లో భాగంగా బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీంతో యూనివర్శిటీ సెక్యూరిటీ గది వద్ద బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటైంది. ఎవరు లోపలికి రావాలన్నా అక్కడుంచిన ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫయర్ లో ముందుగా వేలిముద్రలు ఇచ్చిన వేలును పెట్టాల్సిందే. అప్పుడు ఆ ముద్రలు గుర్తించిన కంప్యూటర్ 'థ్యాంక్యూ' చెబుతుంది. తన వద్ద ఉన్న డేటాలో ఆ వేలి ముద్రలు సరిపోకుంటే, 'ప్లీజ్ ట్రై ఎగైన్' అంటుంది. అలా అంటే వారికి వర్శిటీ లోపలికి ప్రవేశం ఉండదు. అంటే, కంప్యూటర్ 'థ్యాంక్యూ' చెబితేనే యూనివర్శిటీలోకి ప్రవేశం ఉంటుందన్నమాట. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ను వర్శిటీ వైస్ చాన్స్ లర్ రత్నకుమారి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News