: ట్వీట్లు చేయడం కాదు... రాజధానికి వెళ్లి పవన్ రైతులను ఆదుకోవాలి: వీహెచ్
ఏపీ రాజధాని భూసేకరణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో చేస్తున్న వరుస ట్వీట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు చేశారు. ట్విట్టర్ లో సందేశాలు ఇస్తూ ఇంట్లో కూర్చోవడం కాదన్నారు. ఏపీ రాజధాని ప్రాంతానికి వెళ్లి రైతులను ఆదుకోవాలని పవన్ కు సూచించారు. రైతుల నుంచి బలవంతంగా ఏపీ ప్రభుత్వం భూములను గుంజుకుంటోందని ఆరోపించారు. అందుకే పవన్ వెంటనే అక్కడికి వెళ్లి ఆపాలని కోరారు. తాజాగా చేపడుతున్న భూసేకరణలో కొన్ని గ్రామాల ప్రజల భూములను లాక్కోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ ట్విట్టర్ ద్వారా పలుమార్లు కోరిన విషయం తెలిసిందే.