: సంగా 32 అవుట్... 100 మార్కు దాటిన లంక


కొలంబో టెస్టులో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు 100 మార్కు దాటింది. లంచ్ తర్వాత దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. సంగా వికెట్ అశ్విన్ కు దక్కింది. ప్రస్తుతం మూడో సెషన్ నడుస్తోంది. లంక స్కోరు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు కాగా, క్రీజులో సిల్వా (50 బ్యాటింగ్), తిరిమన్నే (12 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు, భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 393 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News