: ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం... టీఎస్ పీఎస్సీ ఫైళ్లు మాయమయ్యాయని ఫిర్యాదు


ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల మధ్య మరో వివాదం చెలరేగింది. హైదరాబాద్ లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో టీఎస్ పీఎస్సీ కార్యాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. నకిలీ తాళంతో టీఎస్ పీఎస్సీ కార్యాలయం గది తలుపులు తెరిచి రహస్య సమాచార ఫైళ్లను కొందరు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీమాంధ్ర ఉద్యోగులే కీలక ఫైళ్లను అపహరించి ఉంటారని వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న నాలుగు అంతస్తుల పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని రాష్ట్రం విడిపోయాక, రెండు ఫ్లోర్లు చొప్పున రెండు రాష్ట్రాల కమిషన్లకు కేటాయించారు. దాంతో ఉద్యోగుల రాకపోకలు ఒకే ద్వారం నుంచి జరుగుతుంటాయి.

  • Loading...

More Telugu News