: సన్ నెట్వర్క్ ఆస్తుల ఎటాచ్ మెంట్ పై సుప్రీం తాత్కాలిక స్టే


కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కు చెందిన సన్ నెట్వర్క్ కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కొన్ని నెలల కిందట మారన్ సోదరులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఎటాచ్ చేయడంపై అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఎయిర్ సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో దయానిధి, ఆయన సోదరుడు కళానిధి మారన్, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం రూ.742 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అటాచ్ చేసింది. అందులో దయానిధి, ఇతరులకు చెందిన రూ.7.47 కోట్ల ఎఫ్ డీలు, కళానిధి మారన్ కు చెందిన రూ.100 కోట్ల ఎఫ్ డీలు, రూ.2.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే కళానిధి భార్య కావేరికి చెందిన రూ.1.3 కోట్ల విలువైన ఎఫ్ డీలు, రూ.1.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ను కూడా ఈడీ అటాచ్ చేసింది.

  • Loading...

More Telugu News