: పవన్ కల్యాణ్ రాకుంటే అంతా ప్రశాంతమే: ప్రత్తిపాటి
ప్రజల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంతంలో భూసేకరణకు అడ్డం రాకూడదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. పవన్ కల్యాణ్ ఈ విషయంలో కలుగజేసుకోకుంటే, అంతా ప్రశాంతంగా ముగుస్తుందని అన్నారు. ఈ మధ్యాహ్నం ఓ టెలివిజన్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పవన్ తమకు సహజ మిత్రుడని చెప్పారు. పవన్ ఇచ్చే అన్ని సలహా, సూచనలను తాము పాటించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రైతులను రెచ్చగొట్టాలన్న ఆలోచనలో వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని, భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కూడా సమీకరణకే ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. గత రెండు రోజుల్లో రైతుల నుంచి 200 ఎకరాలకు పైగా భూములు ప్రభుత్వానికి అందాయని ప్రత్తిపాటి వివరించారు.