: టీమిండియా 393 ఆలౌట్... హెరాత్ కు 4 వికెట్లు


శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్ కొలంబో టెస్టులోనూ ప్రభావం చూపాడు. హెరాత్ 4 వికెట్లతో సత్తా చాటడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 393 పరుగులకు ఆలౌటైంది. దమ్మిక ప్రసాద్, మాథ్యూస్, చమీర రెండేసి వికెట్లతో రాణించడంతో టీమిండియా 400 మార్కు దాటకుండానే ఇన్నింగ్స్ ముగించింది. రెండో రోజు ఆటలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (56) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, అమిత్ మిశ్రా 24 పరుగులు చేశాడు. అనంతరం, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు వికెట్ నష్టానికి 47 పరుగులతో ఆడుతోంది. ఓపెనర్ కరుణరత్నే కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అతడిని ఉమేశ్ యాదవ్ వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. క్రీజులో దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర (24 బ్యాటింగ్), సిల్వా (19 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News