: తిరుపతిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై చెయ్యి చేసుకున్న మహిళా టీచర్
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న సంగీత కళాశాలలో టీచర్లు తమను వేధిస్తున్నారంటూ విద్యార్థినీ విద్యార్థులు నిరసన తెలియజేస్తుంటే, విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మహిళా టీచర్ భాగ్యరేఖ వారిపై చేయి చేసుకుంది. కెమెరాలు చిత్రిస్తున్నాయని కూడా పట్టించుకోకుండా 'భారత్ మాతాకీ జై' అని నినదిస్తున్న విద్యార్థిని చెంపపై పీకింది. నిరసన తెలుపుతున్న అమ్మాయిలనూ కొట్టింది. పరుష పదజాలంతో దూషిస్తూ కుర్చీలను విసిరేసింది. ఈ ఘటనపై టీటీడీ ఈవోతో పాటు డీఈఓకు ఫిర్యాదు చేస్తామని తెలిపిన విద్యార్థులు, తమపై దాడి చేసిన భాగ్యరేఖపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.