: స్నేహితులు, కుటుంబీకులు ఎక్కడున్నారో చెప్పే సరికొత్త యాప్!
మెసేజింగ్ యాప్ సేవలందిస్తున్న 'లైన్', మరో కొత్త యాప్ ను విడుదల చేసింది. హేర్ (here) పేరిట విడుదలైన ఈ యాప్ లో 200 మంది వరకూ ఎక్కడున్నారన్న విషయాన్ని రియల్ టైం అప్ డేట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. బంధు మిత్రుల్లో ఎవరినైనా ఎంచుకుని వారికో గమ్యస్థానాన్ని సెట్ చేస్తే, వారు ఆ ప్రాంతానికి చేరుకోగానే సమాచారం అందే సౌకర్యం కూడా ఈ యాప్ కల్పిస్తోంది. లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ఈ సేవలు అందుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ఎంత సేపు యాప్ ద్వారా లొకేషన్ సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చన్న విషయమై స్వీయ నియంత్రణ ఉంటుందని, ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ కస్టమర్లు ఉచితంగా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.