: కేంద్ర మంత్రి లెటర్ హెడ్ లో అచ్చుతప్పులు ... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది!


కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మరోమారు సంకట స్థితి ఎదురైంది. స్మృతి ఇరానీ పేరిట జారీ అయిన ఓ లెటర్ హెడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంత్రిగారి లెటర్ హెడ్ లో అక్షర దోషాలు దొర్లిన వైనాన్ని గుర్తించిన నెటిజన్లు, సదరు తప్పులను మార్క్ చేసి మరీ ఆ లెటర్ ను సోషల్ మీడియాలో పెట్టేశారు. అంతటితో ఆగని కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకేసి ఇదేమిటని ఏకంగా మంత్రిగారినే నిలదీశారు. నా పేరునే తప్పుగా రాసుకుంటానా? అంటూ మంత్రి గారు రిప్లై కూడా ఇచ్చారట. అయితే తప్పు దొర్లింది మీ పేరులో కాదు మీ ‘హోదా’ పేరులో అంటూ మళ్లీ నెటిజన్ల నుంచి సమాచారం అందడంతో స్మృతి ఇరానీ అధికారులను వివరణ కోరారు. అసలు దొర్లిన తప్పిదమేంటంటే, మినిస్టర్ అన్న ఆంగ్ల పదంలో ‘ఎన్’ పక్కన ఉండాల్సిన ‘ఐ’ మిస్సైంది. దీనినే నెటిజన్లు మార్క్ చేసి మరీ సోషల్ మీడియాలో పెట్టేశారు.

  • Loading...

More Telugu News