: ఫొటో తమన్నాది... పేరు ఓ బాలికది... ఖాతా నడుపుతున్నది ఇంటర్ కుర్రాడు!


హీరోయిన్ తమన్నా ఫోటో పెట్టి, తనకు తెలుసున్న ఓ బాలిక పేరుతో ఓ ఇంటర్ కుర్రాడు ఫేస్ బుక్ లో ఖాతా నడుపుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొంతకాలం నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ ఏ మాత్రం అనుమానం రాకుండా అతను చాటింగ్ చేస్తున్నాడు. ఓ రోజు అతని స్నేహితుడు ఈ ఖాతాను పరిశీలించగా అసలు విషయం తెలిసింది. వెంటనే అతను సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజమేనని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కుర్రాడు ఖమ్మం జిల్లా వైరా మండలం, గండుగలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ అనే ఇంటర్ విద్యార్థి అని చెప్పారు. ఆ ఊరిలోనే 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచి చాటింగ్ చేస్తున్నాడని వివరించారు. మరోవైపు నిఖిల్ పై సైబర్ నేరం, 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News